Kalalu Kane Kaalaalu Song Lyrics – 7/G Brundavan Colony Movie

https://youtu.be/HeKus55aKcc

Kalalu Kane Kaalaalu Song Lyrics

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా…
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా..

ఇది చేరువ కోరే తరుణం
ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసుల అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం
నిత్య కలలతో తమ తమ రూపం
వెళ్ళు కోరును నిప్పుతో స్నేహం
దేవుని రహస్యమో….

లోకంలో తియ్యని బాష
హృదయంలో పలికే బాష
మెల మెల్లగా వినిపించే ఘోష ఆ………

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా…
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా..

తడిగని కాళ్ళతోటి కడలికేది సంబంధం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పచ్చికేల పచ్చి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేల కలలు కనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
తల్లైనా కొన్ని హద్దులు ఉండును
స్నేహంలో అవి ఉండవులే
ఎగిరొచ్చి కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా…
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా..

ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసుకొని సందెవేళ పిలిచెనులే
తెల్లవారుజాములన్ని నిద్రలేక తెలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే

నడిచేటి దారిలో నీ పేరు కనిపించ
గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించే
అపుడపుడు చిరు కోపం రాగా
కరిగెను ఎందుకు మంచులాగా
భూకంపం అది తట్టుకోగలము
మది కంపం అది తట్టుకోలేం ఆ….ఆ..

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా…
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా..

Also, read about:

Share This Post

Post Comment