Rangamma Mangamma Lyrics – MM Manasi Ram Charan

Rangamma Mangamma Lyrics in Telgue

య్ రంగమ్మ మంగమ్మ
ఓయ్ రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
గొల్లభామ వచ్చి
నా గోరు గిల్లుతుంటే

గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టినా పెదవి సలుపుతుంటే
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టడు
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు

ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టడు
ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ కొరికినానంటే
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు
ఓయ్ రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

Also, read about:

హేయ్ రామ సిలకమ్మ రేగి పండు కొడుతుంటే
రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే
హేయ్ రామ సిలకమ్మ రేగి పండు కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సుడడు మారు రైకైనా తెచ్చి ఇయ్యడు
మరకమ్మా మరకమ్మా అంటే సుడడు మారు రైకైనా తెచ్చి ఇయ్యడు
రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
నా అందమంత మూట గట్టి
అరె కంది సేనుకే ఎలితే

ఆ కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టు ముడుతుంటే
నా అందమంత మూట గట్టి కంది సేనుకెలితే
కందిరీగలొచ్చి నన్ను సుట్టు ముడుతుంటే
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు
రంగమ్మ మంగమ్మ

రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

Share This Post

Post Comment