Kuchi Kuchi Koonamma Song Lyrics – Bombay Movie

Kuchi Kuchi Koonamma Song Lyrics in Telugu

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె
కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా
కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
ఏ కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె
కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట

ఆట నెమలికి మెరుపు సుఖం గాన కోకిలకు పిలుపు సుఖం
చెట్టు వేరుకు పాదు సుఖం ఏ అమ్మనాన్న పిలుపు సుఖం
రాకుమారుడికి గెలుపు సుఖం చంటి కడుపుకి పాలు సుఖం
మొగుడు శ్రీమతి అలకలలు ముద్దు కన్నా ముడుపు సుఖం
రేయిపగలు పన్నీట్లో ఉన్నా రాదు మేనుకి చలికాలం
అల్లిబిల్లిగా లాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం
బుజ్జి బుజ్జి పాపనివ్వు పోకిరాట వేషమొద్దు
ఆ.ఆ… బుజ్జి బుజ్జి పాపనివ్వు పోకిరాట వేషమొద్దు
వేడెక్కే అందాల పెట్టు వేదిస్తే నా మీదే ఒట్టు
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా

చిరుత రెక్కలే పక్షివిలే చిటెకె వెలుగులే దివ్వెవిలే
తోడు నీడ ఇక నీవేలే తరగని పున్నమిలే
తనువుతోటివే తపనలులే ఉరుముతోటివే మెరుపులులే
ఉన్నతోడు ఇక నీవేలే విలువలు తెలియవులే
భూమి తిరగడం నిలబడితే భువిని తాళమే మారదులే
మగని ఆదరణ కరువైతే ఇల్లాలి ప్రేమంతా వేసంగిపాలె
పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ
పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ
బుద్దిగుంటే మంచిదంట దూరాలు కోరింది జంట
కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా

Click here for the details of:

Share This Post

Post Comment